Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి దసరా ఉత్సవాలు.. దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేడు స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భక్తులు ఈ ఉదయం 8 గంటల నుంచి అమ్మవారిని దర్శించుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. కనదుర్గమ్మను నేడు మంత్రి దేవినేని ఉమ దర్శించుకోనున్నారు. కాగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో రాష్ట్రంలోని పలు దేవాలయాలు ఈ ఉదయం నుంచే కళకళలాడాయి. ‘అమ్మ’ను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాలను సుందరంగా అలంకరించారు.

More Telugu News